న్యూఢిల్లీ : 'దిశ ఎన్‌కౌంటర్'లో నేరస్థులను హతమార్చినట్లే ప్రతి రేప్ కేసులో నిందితులను కాల్చి వేయాలని లేదా ఉరి తీయాలని డిమాండ్ దేశవ్యాప్తంగా ఊపందుకుంది. 2012లో ఢిల్లీలో జరిగిన 'నిర్భయ' రేప్ కేసు అనంతరం 2013 నుంచి దేశంలోని క్రిమినల్ చట్టాలను కఠినతరం చేస్తూ వచ్చారు. అదే నిర్భయ కేసులో నిందితులకు ఉరి శిక్షలు పడినా మహిళలపై అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. అంతెందుకు 'దిశ'ఎన్‌కౌంటర్' జరిగిన రెండు రోజుల్లోనే దేశంలో మూడు రేప్ కేసులు నమోదయ్యాయి. 2012లో నమోదైన రేప్ కేసులకన్నా 2018లో రెట్టింపు రేప్ కేసులు నమోదయ్యాయి.
దేశంలో ‘రేప్’లను ఆపేదెలా?