అప్పట్లో అంబేద్కర్‌ను ఓడించాలని ప్రయత్నిస్తే..

 గుంటూరు : భారత రాజ్యాంగ రూపకర్త బీఆర్‌ అంబేద్కర్‌ను ఎంపీగా ఓడించాలని అప్పట్లో కాంగ్రెస్‌ ప్రయత్నిస్తే.. ఆయన్ని గెలిపించటానికి బీజేపీ అండగా నిలిచిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు అన్నారు. స్వాతంత్య్రం తర్వాత దళితుల అభ్యున్నతికి బీజేపీ కట్టుబడి ఉంటూ వచ్చిందని తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రిజర్వేషన్ల విషయంలో బీజేపీకి ఎలాంటి వ్యతిరేకత లేదని స్పష్టం చేశారు. దేశ విస్తృత ప్రయోజనాల కోసం పనిచేసే పార్టీ బీజేపీ అన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు.. ప్రాంతాలకు అతీతంగా అంకితభావంతో పనిచేయటం బీజేపీ గొప్పతనంగా పేర్కొన్నారు.  అధికారంలో ఉన్నా లేకున్నా దళితులు, గిరిజనుల అభ్యున్నతి కోసం పని చేసే పార్టీ బీజేపీ అన్నారు. రామ జన్మభూమి ఉద్యమం కోసం గ్రామ గ్రామానా శిలాన్యాస్ సేకరణ నుంచి రామ జన్మభూమి ట్రస్టు ఏర్పాటు వరకూ బీజేపీ పాత్ర ఉందన్నారు.