పారదర్శకంగా స్థానిక సంస్థల ఎన్నికలు

విజయవాడ: ఎన్నికల పరిశీలకులు వెంటనే విధుల్లోకి చేరాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్‌కుమార్‌ తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తరపున నిర్భయంగా బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి స్థాయిలో పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ఎన్నికల్లో వాలంటీర్ల సేవలు వినియోగించుకోవద్దని స్పష్టం చేశారు.(ఎన్నికల పరిశీలకులుగా ఐఏఎస్‌ల నియామకం)